Get me outta here!

Monday, May 8, 2023

నదీ తీర నగరాలు (River Side Cities)

 1 . వారణాసి నగరం ఏ నది ఒడ్డున ఉంది ?

Ans : గంగ 

2 . హైదరాబాద్ నగరం ఏ నది ఒడ్డున ఉంది ?

Ans : మూసి  

3 . అహ్మదాబాద్  నగరం ఏ నది తీరమున  ఉంది ?

Ans : సబర్మతి   

4 . క్రింది వానిలో హుగ్లీ నది ఒడ్డున ఉన్న నగరం ఏది ?

Ans : కోలకతా

5 . న్యూఢిల్లీ   నగరం ఏ నది తీరమున  ఉంది ?

Ans : యమునా  

6 . ఆగ్రా    నగరం ఏ నది తీరమున  ఉంది ?

Ans : యమునా 

7 . క్రింది వానిలో జీలం నది ఒడ్డున ఉన్న నగరం ఏది ?

Ans : శ్రీనగర్  

8 . క్రింది వానిలో గోమతి  నది ఒడ్డున ఉన్న నగరం ఏది ?

Ans : లక్నో  

9  . అయోధ్య  నగరం ఏ నది తీరమున  ఉంది ?

Ans :సరయు 

10  .   పాట్నా నగరం ఏ నది తీరమున  ఉంది  ?

Ans :   గంగ  

11  . గ్వాలియర్   నగరం ఏ నది ఒడ్డున  కలదు  ?

Ans : చంబల్     

12  . క్రింది వానిలో కృష్ణ  నది ఒడ్డున ఉన్న నగరం ఏది ?

Ans :  విజయవాడ   

13  . సూరత్   నగరం ఏ నది తీరమున  కలదు  ?

Ans : తాపీ (తపతి)

14  . హరిద్వార్   నగరం ఏ నది తీరమున  కలదు  ?

Ans :   గంగ   

15  . నాసిక్   నగరం ఏ నది తీరమున  కలదు  ?

Ans :   గోదావరి   

16  . గౌహతి   నగరం ఏ నది తీరమున  కలదు ?

Ans : బ్రహ్మపుత్ర    

17  . రాజమండ్రి   నగరం ఏ నది తీరమున  కలదు  ?

Ans :  గోదావరి  

18  .క్రింది వానిలో బ్రాహ్మణి   నది ఒడ్డున ఉన్న నగరం ఏది ?

Ans :   రూర్కెలా     

19  . జబల్పూర్   నగరం ఏ నది తీరమున  కలదు  ?

Ans :నర్మద   

20 . కటక్   నగరం ఏ నది ఒడ్డున  కలదు  ?  

Ans :  మహా నది  


0 comments:

Post a Comment